MIS Info News

Latest Information by Notification

Counter

Responsive Ads Here

Thursday, January 16, 2020

*31నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు*


        *లోక్‌సభ, రాజ్యసభలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అధికారిక ప్రకటనను సోమవారం విడుదల చేశాయి. రాష్ట్రపతి ఆదేశాలతో ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు.  జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత బడ్జెట్ సెషన్, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండవ విడత బడ్జెట్ సెషన్ జరగనున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 1 వరకు మధ్యలో విరామం ఉండనుంది. రెండు విడతల మధ్య ఉండే ఈ విరామంలో శాఖల వారీగా ఉన్న బడ్జెట్‌ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలించనున్నాయి.*
#################
*ఆ రెండ్రోజులు బ్యాంకులు పనిచేయవు*...
       *వేతన సవరణపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)తో జరిగిన చర్చలు ముందుకు సాగకపోవడంతో ఈనెల 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు బ్యాంక్ యూనియన్లు బుధవారం పిలుపునిచ్చాయి. డిమాండ్ల సాధన కోసం మరోసారి మార్చి 11 నుంచి 13 వరకూ సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్ల సమాఖ్య (యూఎఫ్‌బీయూ) వెల్లడించింది. అప్పటికీ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఏప్రిల్‌ 1 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని యూఎఫ్‌బీయూ పశ్చిమ బెంగాల్‌ కన్వీనర్‌ సిద్ధార్ధ ఖాన్‌ వెల్లడించారు.*
      *కాగా యూఎఫ్‌బీయూ 15 శాతం వేతన పెంపును కోరుతుండగా ఐబీఏ 12.25 శాతం మేరకే పెంపును పరిమితం చేస్తోందని ఇది తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు. నెలాఖరు నుంచి బ్యాంకు ఉద్యోగులు సమ్మె తలపెట్టడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అత్యవసర క్లియరెన్స్‌, ఏటీఎం సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఖాతాదారులు కోరుతున్నారు.*

*✨ సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి??*



★ సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.

★ అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం  చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా,అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వం *G.O.Ms.No.202 F&P తేది:11.06.1980* ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

★ ఉద్యోగి నిర్వహించుచున్న నకలు(Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS, GPF,TSGLI,పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.

★ ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్ట బద్ధమైనదిగా పరిగణించబడదు.

★ అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affadavit as attested) పరిశీలించి,అట్టి విషయములను సమాంతర(Collateral) ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టరు లో నమోదుచేయాలి *G.O.Ms.No.224 F &P తేది:28.8.1982*

★ పుట్టినతేది,ఉద్యోగ నియామకం,తదితర అంశాలకు సంబంధించిన ఉద్యోగి చెంతనున్న  వివరాల ఆధారంగా నమోదు చేయవచ్చు. అదే విధంగా కార్యాలయంలోనూ, పై అధికారుల కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన కాపీల ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.

★ ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల,అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.

★ పుట్టినతేది,విద్యార్హతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు  విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును.

★ ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున,శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదేవిధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.